మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ''కరెంటు తీగ'' సినిమాలో నటించిన పోర్న్ స్టార్ సన్నీ లియోన్ మళ్లీ తెలుగులో నటించేందుకు సై అంటోంది. బిగ్ బాస్ షో పుణ్యంతో సన్నీ లియోన్ భారత్‌కు వచ్చేసింది. తర్వాత బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ఇక్కడే సెటిలైపోయింది. కరెంట్ తీగతో టాలీవుడ్‌కు తెరంగేట్రం చేసిన ఈ భామ.. ఓ తెలుగు సినిమాలో కీ రోల్ పోషించేందుకు రెడీ అవుతోంది.
ఈ చిత్రంలో సన్నీపై సన్నివేశాలతో పాటు ఓ పాట కూడా చిత్రీకరించబోతున్నారు. ‘కరెంటు తీగ’లో సన్నీ సన్నీ.. పాట తరహాలోనే ఓ హాట్ హాట్ సాంగ్ ఉంటుందని.. ఈ సినిమాకు సన్నీ రాకతో మంచి క్రేజ్ వస్తుందని, ప్రమోషన్ అదిరిపోతుందని సినీ పండితులు అంటున్నారు.