భార్యాభర్తల రిలేషన్ ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే కథాశంతో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమే "చెరసాల". ఎస్ రాయ్ క్రియేషన్స్ పతాకంపై శ్రీజిత్ ,రామ్ ప్రకాష్ గుణ్ణం, నిష్కల, శిల్పా దాస్ హీరో, హీరోయిన్లుగా రామ్ ప్రకాష్ గుణ్ణం దర్శకత్వంలో మద్దినేని సురేష్ సుధా రాయ్ నిర్మిస్తున్నారు..ట్రైలర్‌ను ఎస్వి కృష్ణారెడ్డి విడుదల చేశారు , టీజర్‌ను ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ విడుదల చేశారు. నిర్మాత ఆచంట గోపీనాథ్, బసి రెడ్డిలు "చెరసాల" చిత్రంలోని పాటలను విడుదల చేశారు.