హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు మీటూ పాకిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే దక్షిణాదిన క్యాస్టింగ్ కౌచ్ వివాదం పెను దుమారం రేపింది. ఈ వివాదాల కారణంగా పలువురు సెలెబ్రిటీలు తమ జీవితంలో సాగిన చేదు అనుభవాలను సోషల్ మీడియా ద్వారా బహిర్గతంగా పంచుకుంటున్నారు. ఇదే కోవలో ప్రస్తుతం సినీ నటి తాప్సీ కూడా తనకు జరిగిన చేదు అనుభవాన్ని వెల్లడించింది. ఓ ఆకతాయి తనను అభ్యంతరకరంగా తాకాడని చెప్పుకొచ్చింది.
కరీనా కపూర్ షో 'వాట్ ఉమెన్ వాంట్-2' లో ఆమె మాట్లాడుతూ.. గురుపూజ కోసం ఢిల్లీలోని గురుద్వారాకు కుటుంబ సమేతంగా వెళ్లానని, అప్పుడు అక్కడ విపరీతమైన రద్దీ ఉందని, అదే అదనుగా ఒక ఆకతాయి తనను అసభ్యంగా తాకాడని చెప్పింది. తనపై చేతులేసి ఇబ్బందికరంగా ప్రవర్తించడం మొదలెట్టాడని తెలిపింది. అతని ప్రవర్తన హద్దు మీరడంతో రెండు వేళ్లు పట్టుకుని విరిచేశానని తాప్సీ వెల్లడించింది.
క్రికెటర్ డ్రెస్‌లో భారీ షాట్ కొడుతున్నట్టుగా ఉన్న ఈ పోజ్ ఆకట్టుకుంది. రాహుల్ ధోలాకియా దర్శకత్వంలో వయాకమ్ 18 సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే యేడు ఫిబ్రవరి 5న హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేస్తున్నారు.