మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రధారిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాతగా రూపొందిన తెలుగు వెబ్ సిరీస్ లెవన్త్ అవర్. తెలుగువారికి అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ వారి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న తెలుగు ఓటీటీ ఆహా.. వారి ప్రియమైన తెలుగు ప్రేక్షకులకు ఉగాది సంబరాలను ఎంటర్‌టైన్‌మెంట్‌తో ముందుగానే తీసుకొస్తుంది. అందులో భాగంగా ఏప్రిల్ 9న ఆహాలో మిల్కీబ్యూటీ తమన్నా తొలిసారి నటించిన ఒరిజినల్ లెవన్త్ అవర్ ప్రసారం కానుంది. ఈ సందర్భంగా మంగళవారం లెవన్త్ అవర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, WE హబ్ సీఈఓ దీప్తి రావుల, డైరెక్టర్ ఆఫ్ మేరు ఇంటర్నేషనల్ స్కూల్ మేఘన రావు జూపల్లి, ఆహా సీఈఓ అజిత్ ఠాగూర్, నిర్మాత ప్రదీప్ ఉప్పల పాటి, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, అరుణ్ అదిత్ తదితరులు పాల్గొన్నారు.
ఉమెన్ ఎంటర్ ప్రెన్యూరర్స్‌కు సలహాలతో పాటు, ఆర్థిక సాయం అందించడానికి ఆహాతో WE హబ్ కొలాబ్రేట్ అయ్యింది. ఈ కార్యక్రమంలో షార్టిజీ ఫౌండర్, ఎంటర్ ప్రెన్యూరర్ సురభికి ఆహా, ఉయ్ హబ్ కలిసి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ, ఇతర డిజిటల్ మాధ్యమాలు చేయలేని మంచి విషయాలను, మంచి కంటెంట్‌ను ఆహా తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఆహాతో WE హబ్ కొలాబ్రేట్ అయ్యి ఉమెన్ ఎంటర్ ప్రెన్యూరర్స్‌కు సపోర్ట్ అందిస్తున్నాం. మహిళా సాధికారితను తెలియజేసేలా రూపొందిన లెవన్త్ అవర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. నేను కూడా ఏప్రిల్ 9 కోసం ఎదురుచూస్తున్నాను అన్నారు.
WE హబ్ సీఈఓ దీప్తి మాట్లాడుతూ ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ అంటే ఏదో వంట గదుల్లో పనులు చేసుకునేవాళ్లనో, ఇంటికే పరిమితమైన ఆలోచనలు కలిగిన వారనే భావన చాలా మందిలో ఉంది. కానీ మహిళలు రాణించే, రాణిస్తున్న రంగాలెన్నో ఉన్నాయి. అలాంటి రంగాల్లో రాణిస్తున్న మహిళల ఎదుగులకు సలహాలు, సూచనలతో పాటు ఆర్థిక సాయాన్ని అందించడానికి ఆహా, WE హబ్ చేతులు కలపడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఆర్థిక సాయం అందుకున్న మహిళా ఎంటర్ ప్రెన్యూర్ తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ.. దాన్ని మరో మహిళా ఎంటర్ ప్రెన్యూర్‌ను గుర్తించడానికి మాకు సపోర్ట్ చేస్తే చాలు. ఇలా చేయడం వల్ల మహిళా శక్తి పెరుగుతుంది.
డైరెక్టర్ ఆఫ్ మేరు ఇంటర్నేషనల్ స్కూల్ మేఘన రావు జూపల్లి మాట్లాడుతూ మహిళా సాధికారతను సాధించడం అనేది నేటి సమాజంలో ఎంతో ముఖ్యమైన విషయం. అయితే మన మధ్య ఓ చిన్న అడ్డంకి ఉంటుంది. కానీ.. దాన్నెలా దాటుతామనేది ముఖ్యం. అయితే మారుతున్న కాాలానికి అనుగుణంగా పరిస్థితులు మారుతున్నాయి. మహిళా సాధికారితను సాధించడానికి చేయూత నిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, WE హబ్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆహా విషయానికి వస్తే ఇందులో వర్క్ చేస్తున్న మహిళలు నైపుణ్యం కలిగిన వారు. లెవన్త్ అవర్ విషయానికి వస్తే.. మహిళా సాధికారితను తెలియజేసేది. ఇందులో ప్రధాన పాత్రధారిగా నటించిన అమ్మాయి తన కంపెనీని ఎలా కాపాడుకుందనేదే కథాంశం. చాలా ఇన్‌స్పైరింగ్ స్టోరి. ఈ సందర్భంలో ఆహాలో ప్రసారమైన సామ్ జామ్ షో.. దీన్ని నందినీ రెడ్డి డైరెక్ట్ చేశార. అలాగే మెయిల్ అనే సినిమాను స్వప్న దత్ ప్రొడ్యూస్ చేశారు. ఇవన్నీ మహిళలు చేశారని మాట్లాడటం లేదు. వాటికి మంచి సబ్ స్క్రిప్షన్స్ కూడా రావడం మంచి పరిణామం. అలాంటి వైవిధ్యమైన కథాంశమే లెవన్త్ అవర్. భవిష్యత్తులో మన సమాజాన్ని ఆలోచింప చేసేలా ఆహాలో కంటెంట్ రూపొందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అన్నారు.
నిర్మాత ప్రదీప్ ఉప్పలపాటి మాట్లాడుతూ - 8అవర్స్ అనే పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ లెవన్త్ అవర్ కథను తయారు చేశాను. రెండేళ్ల ముందు నా ప్రయాణం స్టార్ట్ అయ్యింది. అరత్రికా అనే అమ్మాయి తనకు ఎదురైన సమస్యలను ఎలా ఎదుర్కొందనేదే ఈ కథ. సంక్లిష్లమైన ఈ ప్రపంచంలో ఓ రాత్రిలో అరత్రికా ఎలాంటి సమస్యను ఎదుర్కొని సక్సెస్ అయ్యిందో తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ఆమె ఎలా సక్సెస్ అయ్యిందనేది చాలా ఎగ్జయిటింగ్‌గా రూపొందించింది. ఈ జర్నీలో మాకు ఆహా తోడ్పాటు మరచిపోలేనిది. ప్రవీణ్ సత్తారుగారి సపోర్ట్ లేకుంటే మంచి ఔట్ పుట్ తీసుకు రాగలిగాం అన్నారు.
డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ - లెవన్త్ అవర్ కోసం టీమ్ అందరం ఎంతో కష్టపడ్డాం. మగవారు మల్టీ టాలెంటెడ్ కారు. కానీ మహిళలు మాత్రం మల్టీ టాలెంటెడ్. వారు పది పనులైనా చేయగలరు. అలాంటి మహిళల గురించి చెప్పాల్సిన సందర్భాల్లో చాలా విషయాల గురించి మాట్లాడుకోవచ్చు. అదే మేం ఈ వెబ్ సిరీస్‌లో చెప్పాం. అరత్రికా రెడ్డి అనే అమ్మాయి ఈ సిరీస్‌లో ప్రారంభం నుంచే స్ట్రాంగ్ ఉమెన్ కాదు.. సమస్యను ఎదుర్కొనే క్రమంలో ఆమె బలవంతురాలిగా మారుతుంది. ఆమె ఈ కథలో హీరో. ఆమె బలాలే కాదు.. బలహీనతలను గురించి కూడా వెబ్ సిరీస్‌లో చూపెట్టాం. ముఖేష్ అద్భుతమైన విజువల్స్ అందించాడు. ప్రదీప్‌గారు రాసిన స్క్రిప్ట్ చదవగానే బాగా నచ్చేసింది. చాలా కూల్‌గా పని పూర్తి చేశాను. 33 రోెజుల్లో షూట్ పూర్తి చేశాం. యాక్టర్స్, టెక్నికల్ టీమ్ సపోర్ట్‌తో పనిని సులువుగా పూర్తి చేశాం. తమన్నా ఏదో కొత్తగా చేయాలని ఆతృత పడుతుంటుంది. అలాగే అరుణ్, మహతి పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అన్ని పాత్రలు సపోర్ట్ చేయడంతో అరత్రికా పాత్రకు బలం చేకూరింది అన్నారు.
అరుణ్ అదిత్ మాట్లాడుతూ - లెవన్త్ అవర్ ఏప్రిల్ 9న ఆహాలో ప్రసారం అవుతుంది. ప్రారంభంలోనే ఎవరూ సూపర్ హీరో కాలేరు. పరిస్థితులు వ్యక్తులను అలా మారుస్తాయి. లెవన్త్ అవర్‌లోనూ అరత్రికా రెడ్డి పాత్ర అంతే ఛాలెంజింగ్‌గా ఉంటుంది. ప్రతి ఇంట్లో అమ్మ కూడా అంతే గొప్పగా ఉంటుంది. కరోనా వచ్చిన తర్వాత అందరూ వెబ్ సిరీస్‌లను చూడటం మొదలు పెట్టారు. ఇలాంటి కాన్సెప్ట్ మన లాంగ్వేజ్లో కూడా ఉంటే బావుంటుంది కదా, అని అనుకున్నాం. అలాంటి సమయంలో ప్రదీప్ గారు చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో లెవన్త్ అవర్‌గా మన ముందుకు వచ్చారు. ప్రవీణ్ సత్తారుగారు చక్కగా తెరకెక్కించారు. తెలుగులో వస్తున్న అతి పెద్ద వెబ్ సిరీస్. అందరూ చాలా కష్టపడ్డాం. రెండు నెలల పాటు రాత్రిళ్లలో చూశాం. చక్కగా వచ్చింది. ఏప్రిల్ 9న లెవన్త్ అవర్ ప్రసారం అవుతుంది అన్నారు.
మహతి మాట్లాడుతూ - ఇది నా తొలి వెబ్ సిరీస్ లెవన్త్ అవర్. తెలుగులో ప్రసారం అవుతున్న పెద్ద వెబ్ సిరీస్. తమన్నా పాత్ర చుట్టూనే కథ తిరిగినా, ఇందులో చాలా పాత్రలుంటాయి. మహిళలు చాలా మంది రిలేట్ అయ్యే కథాంశం. ఇందులో నాకు అవకాశం ఇచ్చిన ప్రవీణ్ గారికి, ప్రదీప్ గారికి థాంక్స్. ఏప్రిల్ 9న లెవన్త్ అవర్ ప్రసారం అవుతుంది అన్నారు.
ఆహా సీఈఓ అజిత్ ఠాగూర్ మాట్లాడుతూ - గత ఏడాది ఫిబ్రవరిలో ఆహాను స్టార్ట్ చేశాం. ఏడాది సమయంలో ప్రేక్షకులు మమ్మల్ని ఎంతో ఆదరించారు. 31 మిలియన్స్ యాక్టివ్ యూనిక్ యూజర్స్ చేరుకున్నాం. 1.2 మిలియన్ సబ్ స్క్రైబర్స్, తెలుగులో అతి వేగంగా ఆదరణ పొందుతున్న ఓటీటీగా ఆహా ఆదరణ పొందుతుంది. లెవన్త్ అవర్ మహిళా శక్తిని తెలియజేసే వెబ్ సిరీస్. భవిష్యత్ ఇలాంటి కాన్సెప్ట్‌లను మరిన్నింటినీ ప్రేక్షకులకు అందిస్తాం. ఇదే సందర్భంలో ఆహాతో, WE హబ్ కొలాబ్రేట్ అవుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఏడాది సమయంలో ఆరేడు మహిళా ఎంటర్ ప్రెన్యూర్స్‌కు సపోర్ట్ చేస్తాం. ఆర్థికంగా కూడా వారి మా సపోర్ట్ అందిస్తాం అన్నారు.