ఇటీవలే రెండు దశాబ్దాల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్న టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా సక్సెస్‌ఫుల్‌గా తన కెరీర్‌ను కొనసాగిస్తుంది. ముఖ్యంగా, స్పెషల్ సాంగ్స్‌లో మెరుస్తోంది. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన తమన్నాకు ఐటెం సాంగ్స్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తమ సినిమాలో తమన్నా సాంగ్ ఉంటే హిట్ అయినట్టేనని నిర్మాతలు, దర్శకులు భావిస్తున్నారు.
బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్, వాణి కపూర్ జంటగా తెరకెక్కిన "రైడ్-2" చిత్రంలో తమన్నా మరోసారి మెరిసింది. "నషా" అనే స్పెషల్ సాంగ్‌తో ఆలరించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సాంగ్ 24 గంటల్లోనే 12 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.