ఈ సినిమా ప్రారంభోత్సవం కాశీలో జరిగింది. టీజర్‌ను కుంభమేళాలో లాంచ్ చేశారు. ఇప్పుడు, ట్రైలర్‌ను లాంచ్ చేయడానికి మేకర్స్ ముంబైని ఎన్నుకున్నారు. విడుదల దగ్గర పడుతుండటంతో ఓదెల 2 ప్రచార కార్యక్రమాలు దూకుడుగా జరుగుతున్నాయి.
ఈ చిత్రానికి కాంతర ఫేం అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్, సౌందర్‌రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. టాలెంటెడ్ టీమ్‌తో ఓదెల2 సినిమా మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది.
తారాగణం: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి