గంజాయికి బానిస అయిన తమిళ హీరో ఎవరు?

ఆదివారం, 25 ఆగస్టు 2019 (13:57 IST)
తమిళ అగ్రనటుడు, దర్శకుడు అయిన కె.భాగ్యరాజా ఒకరు. ఈయన ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను ఓ సారి ఆసక్తి కొద్ది గంజాయి తాగానని, చివరకు తాను దానికి బానిస అయినట్టు వెల్లడించారు. ఈ వ్యసనం నుంచి తాను చాలా కష్టంపై బయటపడ్డాననీ, యువత ఇటువంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. 
 
నూతన నటీనటులు విక్కీ ఆదిత్యా, వైశాఖ్‌, హరిణి నటిస్తున్న 'కోలా' చిత్రం ఆడియో రిలీజ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నా దగ్గర అసిస్టెంట్‌గా ఓ యువకుడు ఉండేవాడు. నేను అప్పట్లో రామనాథపురం నుంచి కోయంబత్తూరుకు రోజూ వచ్చి వెళుతుండేవాడిని. ఓరోజు మేమిద్దరం క్యారమ్స్ ఆడుతున్నాం.
 
అతను తాగుతున్న సిగరెట్ కొస వింతగా మెరుస్తూ కనిపించింది. దీంతో అదేంటని నేను అడిగా. తాను గంజాయిని సిగరెట్‌లో పెట్టి తాగుతున్నాననీ, ఇది తాగితే ధైర్యం వస్తుందన్నాడు. దీంతో ఒక్కసారి తాగి చూద్దామని ఆశతో గంజాయి సిగరెట్ కాల్చా. 
 
ఆ తర్వాత దానికి బానిసై పోయా. సినీ దర్శకుడిగా మారేందుకు వచ్చి గంజాయికి బానిస కావడంతో తప్పుదోవలో వెళుతున్నానని అనిపించింది. చివరకు అతికష్టం మీద ఆ దురలవాటును వదిలించుకున్నా. యువత ఇలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి' అని భాగ్యరాజా తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు