పేరుకే టెక్కీ.. కానీ కేటుగాడు.. ఫ్రంట్ ఆఫీసు ఉద్యోగం కోసం యువతులను బుట్టలో వేసుకుని వారిని వేధించేవాడు. ఇతని మాయలో 600 మంది అమ్మాయిలు పడి.. న్యూడ్ ఫోటోలు, డబ్బులు పంపారు. కానీ హైదరాబాదుకు చెందిన ఓ మహిళ ఇతని వేధింపులు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.
ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే మెసేజ్ పంపమని చెప్పాడు. చాలా మంది అమ్మాయిలు, మహిళలు, యువతులు తమకు ఉద్యోగం కావాలని మెసేజ్‌లు పంపేవాళ్లు. వాళ్ల ఫోన్ నంబర్ తెలుసుకొని, కాల్ చేశేవాడు. అర్చనా జగదీష్ తాలూకా అని చెప్పేవాడు.
ఇంటర్వ్యూ చేస్తున్నానంటూ మాయమాటలు మాట్లాడేవాడు. త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగం ఇప్పిస్తానని వాళ్లను నమ్మించేవాడు. అలా వాళ్లతో కనెక్ట్ అయ్యేవాడు.
ఒక్కసారి అమ్మాయిలు తనకు కనెక్ట్ అవ్వగానే ఫ్రంట్ ఆఫీస్, రిసెప్షనిస్ట్ జాబ్ చెయ్యాలంటే అందంగా ఉండాలనీ, మంచి ఫిజిక్ మెయింటేన్ చేస్తూ వుండాలని.. న్యూడ్, ఇతరత్రా ఫోటోలు పంపితే ఫిజిక్‌పై సలహాలిస్తామని చెప్పాడు. ఇతడి మాటలు నమ్మిన కొందరు యువతులు మోసపోయారు.