కరోనాతో డబ్బుల్లేవ్.. సీరియళ్లలో నటించే అన్నాచెల్లెలు ఆత్మహత్య

ఆదివారం, 7 జూన్ 2020 (09:56 IST)
కరోనా మహమ్మారి సోకి వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా.. కోవిడ్ కారణంగా లాక్ డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇక దేశ వ్యాప్తంగా కూడా ముంబై, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో టీవీ నటులు షూటింగులు లేక, చేతిలో డబ్బుల్లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. 
 
ఇలానే గత మూడు నెలల నుంచి షూటింగ్స్ లేకపోవడంతో.. ఆర్థిక ఇబ్బందులతో సీరియళ్లలో నటించే అన్నాచెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలోని కొడంగయ్యూర్‌లో జరిగింది. టీవీ సీరియల్స్‌లో నటించే అన్నాచెల్లెళ్లు, శ్రీధర్, జయ కళ్యాణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారు నివసిస్తున్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు వచ్చి డోర్ పగలగొట్టి చూడగా.. అన్నాచెల్లెళ్ల మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. వీరు ఆత్మహత్య చేసుకొని కొన్ని రోజులు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు