సూర్య సినిమాలకు కరోనా, మిడతల దాడికి లింకు..ఎలాగంటే?

శుక్రవారం, 29 మే 2020 (15:44 IST)
సూర్య సినిమాలకు ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలకు లింకుందనే చర్చ మొదలైంది. ఎలాగంటే.. కరోనా మహమ్మారి, మిడతల దాడి.. ఇలా వరుస పరిణామాలను ప్రపంచం మొత్తం చూస్తూనే వుంది. అయితే ఈ పరిణామాలను ముందే ఊహించారు సూర్యతో సినిమా చేసిన దర్శకులు. 

ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురగదాస్ తెరకెక్కించిన సెవెన్త్ సెన్స్ సినిమాలో ఓ వైరస్‌ని తయారు చేసే చైనా భారత్‌లో దాన్ని ప్రయోగిస్తుంది. అచ్చు అలానే కాకపోయినా ఇప్పుడు కరోనా వైరస్‌ చైనాలోనే పుట్టి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది.
 
ఆపై మిడతల దాడి గురించి చెప్పాలంటే.. సూర్య హీరోగా కేవీ ఆనంద్ తెరకెక్కించిన బందోబస్తు చిత్రంలో మిడతల దాడిని చూపించారు. ఇవి రెండు మాత్రమే కాదు సూర్య నటించిన ''బ్రదర్స్'' సినిమాలో ఒలింపిక్స్‌లో పతకాల కోసం యూరోపియన్ రిపబ్లిక్ ఆఫ్ ఉక్వేనియా ఆ దేశ ఆటగాళ్లకి ఎనర్జీ డ్రింక్ ఇస్తుంది. నిజ జీవితంలో ఆ ఆరోపణలను ఎదుర్కొన్న రష్యా టీమ్‌పై ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ గతేడాది నిషేధం విధించింది. 
 
ఇలా వరుస పరిణామాలతో సూర్య నటించిన ఈ మూడు చిత్రాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ సూర్యకు ఓ రిక్వెస్ట్ పెడుతున్నారు. సార్ మీరు నటించిన 24 సినిమాలోని టైమ్ మిషన్‌ని ఇస్తారా..? సర్ అంటూ పలువురు నెటిజన్లు సూర్యను ప్రశ్నిస్తున్నారు.

ఈ టైమ్‌ మిషన్‌ వస్తే ఇప్పుడున్న పరిస్థితులను మార్చవచ్చునని కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు కోలీవుడ్‌ దర్శకులు భవిష్యత్‌ని ముందే ఊహిస్తున్నారంటూ నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు