కృష్ణ వ్రింద విహారి లోని తార నా తార పాట విడుదల అయింది. నాగ శౌర్య , షిర్లీ సెటియాల అందమైన కెమిస్ట్రీ ని చూపించే మెస్మెరిజింగ్ నెంబర్ స్వరపరిచారు మహతి. లీడ్ పెయిర్ బైక్ రైడ్ కివెళ్ళడం, షిర్లీ కౌగలించుకున్నపుడు శౌర్య మదురమైన అనుభూతిని పొందడం, ప్రేమికులిద్దరూ వెచ్చని రాత్రిలో హాయిగా విహరించడం లవ్లీగా వుంది. ఈ పాటకి శ్రీమణి సాహిత్యం యూత్‌ఫుల్ గా ఉంది. నకాష్ అజీజ్ పాటని బ్రిలియంట్ గా పాడారు.
కృష్ణ వ్రింద విహారి' సెప్టెంబర్ 23న విడుదలకు సిద్ధమవుతోంది.
తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక విభాగం: దర్శకత్వం: అనీష్ ఆర్. కృష్ణ, నిర్మాత: ఉషా ముల్పూరి, సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి, సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: సాయిశ్రీరామ్, సహ నిర్మాత: బుజ్జి, ఎడిటర్ - తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ - రామ్ కుమార్.