వైవిధ్యమైన చిత్రాల్లోనటిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఈ టైటిల్ పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ బింబిసార. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ ట్యాగ్ లైన్. వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆగస్ట్ 5న సినిమా రిలీజ్ అవుతుంది. జూలై 29న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగనుంది. హీరో ఎన్టీఆర్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో బింబిసార చిత్రం నుంచి రిలీజ్ ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదల చేసి చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు.
సినిమా రిలీజ్ ట్రైలర్‌లో కళ్యాణ్ రామ్ పాత్రలోని వేరియేషన్స్.. అందుకు తగ్గట్టు ఆయన టెరిఫిక్ యాక్టింగ్ ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి ట్రైలర్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది.
ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ మ్యూజిక్. ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: సిరి వెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, డాన్స్: శోభి, రఘు, ఫైట్స్: వెంకట్, రామకృష్ణ, వి.ఎఫ్.ఎక్స్: అనిల్ పడూరి, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె, ఎడిటర్: తమ్మిరాజు, మ్యూజిక్: చిరంతన్ భట్, నేపథ్య సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు, ప్రొడ్యూసర్: హరికృష్ణ.కె, దర్శకత్వం: వశిష్ఠ్.