తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసివేయాలని కోరుతూ ఆందోళన జరిగింది. ఈ ఆందోళన ఉధృతం కావడంతో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు తుపాకీ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది వరకు చనిపోయారు. ఈ మృతుల కుటుంబ సభ్యులను పలువురు హీరోలు, రాజకీయ నేతలు వచ్చి పరామర్శించారు. వీరంతా పెద్ద హడావుడి చేస్తూ వచ్చి వెళ్లారు. పబ్లిసిటీ కోసం వెంపర్లాడారు.
కానీ, హీరో విజయ్ ఇందుకు పూర్తి విరుద్ధం. తూత్తుకుడికి వచ్చిన విజయ్.. ఎలాంటి హడావిడీ లేకుండా సైలెంట్‌గా వచ్చి అంతే సైలెంట్‌గా వెళ్లిపోయారు. మంగళవారం రాత్రి బైక్‌పై విజయ్ తూత్తుకుడి చేరుకున్నారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.