తమిళనాట విజయ్ కొత్త పార్టీ..? మాస్టర్ కోసం అన్నాడీఎంకేకు మద్దతిస్తారా?

బుధవారం, 30 డిశెంబరు 2020 (12:48 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ఇక లేదని ప్రకటించిన నేపథ్యంలో.. తమిళనాట మరో నటుడి రాజకీయ అరంగేట్రం ఖరారు అయ్యేలా వుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రముఖ తమిళ సినీ నటుడు 'ఇళయదళపతి' విజయ్‌ తన మక్కల్‌ మయ్యం జిల్లా శాఖల నాయకులు, కార్యదర్శులతో చర్చలు జరుపుతున్నారు.
 
ఎన్నికల్లో ఏ పార్టీ కూటమి మద్దతు ఇవ్వాలనే విషయంపైనే గత వారం రోజులుగా విజయ్‌ మక్కల్‌ మయ్యం నేతలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. గత ఏప్రిల్‌లో షూటింగ్‌ పూర్తి చేసుకున్న విజయ్‌ చిత్రం 'మాస్టర్‌' సంక్రాంతి పండుగకు విడుదలవుతోంది. ప్రస్తుతం థియేటర్లలో 50 శాతం మంది ప్రేక్షకులనే అనుమతిస్తున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో తన 'మాస్టర్‌' చిత్రానికి ఆశించినంత కలెక్షన్లు రావని భావించిన విజయ్‌ ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి పళనిస్వామిని కలుసుకున్నారు. జనవరి నుంచి థియేటర్లలో పూర్తి సామర్థ్యం మేరకు ప్రేక్షకులను అనుమతించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
 
విజయ్‌ వినతిని సానుభూతితో పరిశీలిస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లోనే విజయ్‌ రాజకీయ ప్రవేశంపై తన నిర్ణయాన్ని ఆకస్మికంగా వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా తన మక్కల్‌ ఇయక్కమ్‌ నేతలతో చర్చించిన మీదట అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూటమికి మద్దతివ్వాలన్న విషయంపై ఈ పాటికే విజయ్‌ ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. 
 
ఎన్నికల నోటిషికేషన్‌ విడుదలైన తరువాత విజయ్‌ మక్కల్‌ మయ్యం నిర్వాహకులకు ఎవరికి ఓటు వేయాలనే విషయంపై సుదీర్ఘ ప్రకటన చేస్తారని చెప్తున్నారు. ఇంకా కొత్త పార్టీ పెట్టే ఆలోచన కూడా లేకపోలేదని రాజకీయ పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు