ఎన్టీఆర్ జీవితాన్ని 10వ తరగతి పాఠ్యాంశంలో చేర్చినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు: బాలకృష్ణ

శనివారం, 5 సెప్టెంబరు 2020 (15:26 IST)
ఎన్టీఆర్ జీవితాన్ని 10వ తరగతి పాఠ్యాంశంగా చేర్చినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు నందమూరి బాలకృష్ణ. కళకి, కళాకారులకి విలువను పెంచిన కధానాయకుడు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు ఎన్టీఆర్ అన్నారు బాలకృష్ణ.
 
ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ, అన్నగారు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు.
 
వారి గురించి భావితరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకంలో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణా ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు నందమూరి బాలకృష్ణ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు