Aditya Om, Raghu Tirumala, Prasanna Kumar
విలక్షణ నటుడు ఆదిత్య ఓం బందీ అనే చిత్రంతో గత వారం ఆడియెన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే.రఘు తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గల్లీ సినిమా బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీకి థియేటర్లో ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బందీ మంచి విజయాన్ని సాధించడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.