లవ్ రెడ్డి సినిమా నుంచి కైలాష్ ఖేర్ పాడిన ఎమోషనల్ సాంగ్ ప్రాణం కన్నా.. రిలీజ్

డీవీ

బుధవారం, 9 అక్టోబరు 2024 (13:32 IST)
Anjan Ramachandra, Shravani Reddy
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం "లవ్ రెడ్డి".  కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి,  మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా "లవ్ రెడ్డి" సినిమా అక్టోబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
"లవ్ రెడ్డి" సినిమా నుంచి ఈ రోజు సెకండ్ సింగిల్ 'ప్రాణం కన్నా..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ పాడిన ఈ హార్ట్ బ్రేకింగ్ ఎమోషనల్ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. ప్రిన్స్ హెన్రీ కంపోజ్ చేసిన ఈ పాటకు కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. ' ప్రాణం కన్నా ప్రేమించినా..ఆ ప్రేమనే తెంచావుగా....' అంటూ ప్రేమికుడి బాధను వ్యక్తం చేస్తూ సాగుతుందీ పాట. 'ప్రాణం కన్నా..' పాటకు "లవ్ రెడ్డి" మూవీలో ఎంతో ఇంపార్టెన్స్ ఉండనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు