చిన్ననాటి జ్ఞాపకాలను, తల్లిదండ్రుల ప్రేమను, స్వచ్ఛమైన స్నేహాన్ని, పల్లె వైభవాన్ని గుర్తుచేసే ఈ పాటకు దర్శకుడు సాత్విక్ స్వయంగా సాహిత్యాన్ని, బాణీలను సమకూర్చగా... రితేష్ జి రావు ఆలపించారు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందని, రానున్న రోజుల్లో మరిన్ని అప్డేట్స్ అందిస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు.