మహా శివరాత్రి సందర్భంగా ఈ పాట మరింతగా ట్రెండ్ అవుతోంది. ఈ పాట అద్భుతమైన విజయం సాధించడం గురించి నటుడు-నిర్మాత విష్ణు మంచు మాట్లాడుతూ.. శివా శివా శంకరా పాటకు వచ్చిన అద్భుతమైన స్పందన చూసి మేం చాలా సంతోషిస్తున్నాం. ప్రజలు దానిని స్వీకరించిన విధానం, రీల్స్ చేస్తూ తమ తమ భక్తిని ప్రదర్శిస్తుండటం ఆనందంగా ఉంది. ఇంతలా ఈ పాట ట్రెండ్ అవుతుందని మేం ఊహించలేదు. శివరాత్రి వస్తున్నందున ఈ పాట మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని అర్థం అవుతోంది అని అన్నారు.
శివభక్తుడైన కన్నప్ప పురాణ కథను అందరి ముందుకు తీసుకు రాబోతున్నారు. క్లిష్టమైన కథనాన్ని, అద్భుతమైన విజువల్స్, అసాధారణమైన సమిష్టి తారాగణంతో అద్భుతంగా తెరకెక్కించారు. విష్ణు మంచు కన్నప్ప పాత్రను పోషిస్తుండగా.. రుద్రుడిగా ప్రభాస్, మహా శివుడిగా అక్షయ్ కుమార్ కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.