చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

దేవీ

సోమవారం, 7 ఏప్రియల్ 2025 (11:10 IST)
Tsunami Kitty, Charisma
సునామీ కిట్టి, చరిష్మా జంటగా 'కోర' అనే చిత్రాన్ని దర్శకుడు ఒరాటశ్రీ భారీ ఎత్తున  తెరకెక్కించారు. ఈ సినిమాలో చరిష్మా, పి.మూర్తి ప్రధాన పాత్రలను పోషించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద డా.ఎ.బి.నందిని, ఎ.ఎన్.బాలాజీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్‌, పాటలు సినిమా మీద అంచనాలు పెంచేశాయి.
 
ఇక తాజాగా ఆస్కారు అవార్డు గ్రహీత చంద్రబోస్ రిలీజ్ చేసిన ఒప్పుకుందిరో అంటూ సాగే ఈ పాట అందర్నీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ నెలలో ఈ మూవీని విడుదల చేయనున్నారు. ఈ మేరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ప్రస్తుతం అయితే సెన్సార్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
 
ఈ చిత్రానికి సెల్వం మాతప్పన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేయగా.. బిఆర్ హేమంత్ కుమార్ సంగీతం అందించారు. కె.గిరీష్ కుమార్ ఎడిటర్‌గా పని చేశారు. 
 తారాగణం: సునామీ కిట్టి, చరిష్మా, పి.మూర్తి , M.K మాత , మునిరాజు , నినాసం అశ్వత్ తదితరులు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు