కాగా, ప్రతాప్ ఆర్ట్స్ అధినేత (నిర్మాత)గా కె.రాఘవ అనేక చిత్రాలు నిర్మించారు. ముఖ్యంగా, జగత్ జంత్రీలు, తాతామనవడు, సంసారం సాగరం, జగత్ కిలాడీలు, చదువు సంస్కారం, తూర్పు పడమర, సూర్య చంద్రులు, అంతులేని వింతకథ, ఇంట్లో రామయ్య వీధిలో కిృష్ణయ్య, అంకితం, ఈ ప్రశ్నకు బదులేది వంటి హిట్ సినిమాలు ఆయన నిర్మించారు.
1972లో 'తాతమనవడు', 1973లో 'సంసారం సాగరం' సినిమాలకుగాను ఆయనకు నంది అవార్డులు దక్కాయి. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారంతో పాటు 2012లో రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు కూడా ఆయనను వరించింది. చిత్రపరిశ్రలో దిగ్గజాలైన దాసరి నారాయణరావు, ఎస్పీ బాలు, రావుగోపాల్‌రావు, కోడి రామకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, సుమన్, భానుచందర్‌లను చిత్రపరిశ్రమకు ఆయన పరిచయం చేశారు.
ఈయన నిర్మాతగానే కాకుండా, నటుడుగా కూడా అయన బాల నాగమ్మ, చంద్రలేఖ వంటి చిత్రాల్లో కనిపించారు. రాఘవ మృతిపట్ల తెలుగు సినీ ప్రముఖులతో పాటు.. మావీ ఆర్టిస్ట్ అసోయేషన్ ప్రతినిధులు నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో నేడు జరుగుతాయని ఆయన కుమారుడు తెలిపారు.