ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైన "బాహుబలి 2" చిత్రంపై హీరో నాని తనదైనశైలిలో స్పందించాడు. ఈ చిత్రాన్ని తిలకించిన తర్వాత నాని ఓ ట్వీట్ చేశాడు. ఇంతకీ నాని సోషల్ మీడియా ద్వారా ఏమన్నాడంటే... 'నువ్వు మా పక్కన ఉన్నంత వరకు తెలుగు సినిమా గురించి మాట్లాడే మగాడు ఇంకా పుట్టలేదు రాజమౌళి మామా' అన్నాడు. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
కాగా, కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఓ ఒక్క సినీ అభిమానిని కదిపినా... వినిపించేది ఒకటే మాట... 'బాహుబలి-2: ద కన్ క్లూజన్'. ఈ రెండున్నర గంటల చిత్రం గురించి గత మూడేళ్ళుగా మాట్లాడుకుంటున్నారు. ఇపుడు చిత్రం విడుదలయ్యాక మరింతగా చర్చల్లో మునిగిపోయారు.