బుల్లితెర నటి శ్రీవాణి మరో వివాదంలో చిక్కుకుంది. తన వదినను కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీవాణి తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఇంతకీ విషయం ఏంటయా అంటే... శ్రీవాణి భర్త విక్రమాదిత్య కెవ్వు కబడ్డి అనే షోను జెమినీ టీవీలో చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా టీవీ నటులు పాల్గొంటున్నారు. కాగా కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా నటి కవిత వ్యవహరిస్తున్నారు.