బిగ్ బాస్ ఐదో సీజన్‌: టీవీ-9 యాంకర్ ప్రత్యూష ఎంట్రీ ఇస్తుందా?

బుధవారం, 17 మార్చి 2021 (21:04 IST)
బిగ్ బాస్ ఐదో సీజన్‌లో పాల్గొనే వారి గురించి ప్రస్తుతం చర్చ మొదలైంది. ఈ జాబితాలో టిక్ టాక్ దుర్గా రావు ముందున్నాడు. తనకు అక్కడ్నుంచి ఫోన్ వచ్చిందని చెప్పాడు దుర్గా రావు. ఈయనతో పాటు యూ ట్యూబ్ స్టార్ షన్ముఖ్ జస్వంత్‌ను అడిగారని తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న బిజీలో.. ఆయనకు ఉన్న క్రేజ్ కారణంగా వెళ్తాడా అనేది అనుమానమే. 
 
మరోవైపు సింగర్ సునీతను కూడా బిగ్ బాస్ 5లో తీసుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య ఆమె పేరు ట్రెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరొకరి పేరు కూడా బయటికి వచ్చింది. టీవీ-9 యాంకర్ ప్రత్యూషను బిగ్ బాస్ హౌజ్‌లోకి పిలుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 
 
నిజానికి సీజన్ 2 నుంచి బిగ్ బాస్‌కు టీవీ 9కి విడదీయరాని అనుబంధం ఉంది. సీజన్-2లో దీప్తి నల్లమోతు వచ్చింది. దాదాపు 8 వారాలు ఉంది. మూడో సీజన్‌లో జాఫర్ వచ్చాడు. ఆయన రెండు వారాలు మాత్రమే ఉన్నాడు.
 
మొన్నటి సీజన్‌లో యాంకర్ దేవి నాగవల్లి వచ్చింది. ఈమె అనూహ్యంగా మూడో వారంలోనే ఇంటి ముఖం పట్టింది. ఈమె ఎలిమినేషన్‌పై అప్పట్లో వివాదం కూడా రేగింది. ఇప్పుడు వీళ్ల బాటలోనే ప్రస్తుతం టీవీ 9లో పని చేస్తున్న ప్రత్యూషను బిగ్ బాస్ హౌజ్‌కు పిలిచినట్లు తెలుస్తుంది. దీనికి ఈమె కూడా ఓకే చెప్పిందని తెలుస్తోంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు