తెలుగు ప్రేక్షకులు సినిమారంగం పట్ల ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రేమ చూపిస్తారు. కరోనా మహమ్మారి పరిస్థితి ఉన్నప్పటికీ `ఉప్పెన` చిత్రాన్ని చూడడానికి ఆడియన్స్ భారీగా థియేటర్స్‌కి వచ్చారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. నూతన నటీనటులు, నూతన దర్శకుడు కలిసి ఈ ఫీట్‌ను సాధించడం ఇది మొదటిసారి. ఇండియన్ సినిమాలోనే ఇంతవరకూ ఇలా జరగలేదు.