యూత్ ఫుల్ లవ్ స్టోరీతో శ్రీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'వారధి'. రాధాకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై, పెయ్యాల భారతి, ఎం.డి. యూనస్ నిర్మాతలుగా, అనిల్ అర్కా, విహారికా చౌదరి హీరోహీరోయిన్లుగా, తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సర్ సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసి చిత్ర యూనిట్ ను అభినందించారు.