వేణుమాధవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కమెడియన్.. ఈ మధ్య కనిపించట్లేదు. ఇందుకు కారణం ఆయన ఆరోగ్య పరిస్థితి అని రూమర్స్ వచ్చాయి. అప్పట్లో బిజీ కమెడియన్‌గా వున్న వేణుమాధవ్ రాం చరణ్ ' రచ్చ' తరువాత కనిపించకుండా పోయాడు. దాంతో వేణుమాధవ్ హెల్త్ మీద రకరకాలుగా రూమర్స్ క్రియేట్ అయ్యాయి.
త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' మూవీతో కమెడియన్‌గా రీఎంట్రీ ఇస్తున్నానని.. ఇంకా రెండు.. మూడు క్రేజీ ప్రాజెక్టులు కూడా చేస్తున్నానని తెలిపాడు. దీంతో వేణు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే వేణుమాధవ్ ఆఫర్లు లేక నానా తంటాలు పడుతున్నారని.. అందుకే పవన్ అతనికి తన సినిమాలో ఆఫరిచ్చినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలొస్తున్నాయి.