తారలపై అభిమానం హద్దు మీరుతున్న కాలమిది. ముఖ్యంగా హీరోయిన్లు బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే చాలు అభిమానం పేరిట కొందరు హద్దులు మీరిపోతున్నారు. ఒంటి మీద చేతులు వేయడం, కిస్ చేసేందుకు ప్రయత్నిచడం వంటివి నటీమణులకు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి.
గతంలో హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్, శిల్పా శెట్టి ఉదంతం ఎంతటి వివాదానికి దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీని పబ్లిక్‌గా కిస్ చేసిన ఓ ఇంటర్నేషనల్ సెలబ్రిటీపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. ముద్దుకు ఆమె ఓకే చెప్పాకే ఆయన ముందుకు కదలడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.