వివాహ జీవితం కెరీర్‌పై ప్రభావం చూపదు.. ఆలోచిస్తూ కూర్చుంటే గోవిందా: విద్యాబాలన్

శుక్రవారం, 10 జూన్ 2016 (14:56 IST)
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ప్రస్తుతం ''Te3n'' సినిమా ప్రమోషన్‌లో బిజీ బిజీగా ఉంది. థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ద్వారా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది. ఇంకా ఈ సినిమాలో తన పాత్ర వెరైటీగా ఉంటుందని చెప్పింది. బాలీవుడ్‌లో కహానికి తర్వాత ఈ సినిమా కూడా తనకు మంచి పేరు సంపాదించి పెడుతుందని విద్యాబాలన్ వెల్లడించింది. 
 
బాలీవుడ్‌లో వినూత్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ.. నటిగా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించిపెట్టుకున్న విద్యాబాలన్.. పెళ్లికి తర్వాత సినీ కెరీర్‌లో కొనసాగడం కష్టమని చెప్తున్న హీరోయిన్లకు గుడ్ యాన్సర్ ఇచ్చింది. కష్టపడి పనిచేస్తే పెళ్లికి తర్వాత కూడా సినీ ఇండస్ట్రీలో రాణించవచ్చునని తెలిపింది. అయితే వచ్చిన అవకాశాలను చేసుకుంటూ పోవాలని.. పాత్రల కోసం ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం జరగదని చెప్పేసింది. 
 
తన కెరీర్‌పై వివాహ బంధం ఎలాంటి ప్రభావం చూపదని క్లారిటీ ఇచ్చింది. ఆరోగ్య సమస్యలు వస్తే మినహా తన పని తాను చేసుకుంటూ పోతానని.. ఆరోగ్యం బాగోలేకపోయినా బాగా విశ్రాంతి తీసుకుని తర్వాత యధావిధిగా షూటింగ్‌లలో బిజీ బిజీ అయిపోతానంది. పెళ్లైన తర్వాత తనకు Te3nతో పాటు కహానీ 2, బేగమ్ జాన్ వంటి సినిమాల్లో నటించేందుకు ఆఫర్లు రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.  
 
కానీ బీటౌన్‌లో మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలకు క్రేజ్‌ తెచ్చిపెట్టిన విద్యాబాలన్ టాలెంట్‌తో జాతీయస్థాయిలోనూ ఉత్తమ నటిగా నిరూపించుకుంది. అయితే.. తనలో దాగి ఉన్న మరో ప్రతిభను మాత్రం బయటపెట్టలేకపోతోందట. నటిగా నిరూపింకుంటూనే అప్పుడప్పుడు మనసులోకి వచ్చిన ఆలోచనలను కథలుగా మార్చాలని అనుకునేదాన్నని చెప్పింది. 
 
అయితే.. ఆ రంగంలో అంతగా ప్రావీణ్యం లేకపోవడంతో వాటిని తన సన్నిహితులైన రచయితలకు చెబుతూ వారిచేత రాయించే ప్రయత్నం చేసేదాన్ని అని చెప్పింది. తన వద్ద చాలానే ఐడియాలు ఉన్నాయని .. కానీ రచయితకు ఉండాల్సిన ప్రతిభ తనకు లేదని తాజా ఇంటర్వ్యూలో విద్యాబాలన్ చెప్పుకొచ్చింది.

వెబ్దునియా పై చదవండి