సింధూర్ పెడుతుండగా వణికిన వరుడు చేయి, పెళ్లి రద్దు చేసిన వధువు

ఐవీఆర్

శనివారం, 14 జూన్ 2025 (15:38 IST)
తన నుదుట సింధూర్ పెడుతున్న సమయంలో తనకు కాబోయే భర్త చేయి వణికిందని పెళ్లి రద్దు చేసుకున్నది ఓ వధువు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని కైమూరు జిల్లాలో జరిగింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బీహార్ రాష్ట్రంలోని కైమూరు జిల్లాలో ఓ యువజంట పెళ్లి తంతు ఘనంగా జరుగుతోంది. ఇంతలో వధువుకి సింధూరం దిద్దే కార్యక్రమం వచ్చేసింది. వరుడికి కుంకుమ ఇచ్చి వధువు నుదుటిన పెట్టమని పురోహితుడు చెప్పారు. కుంకుము తీసుకుని పెట్టే సమయంలో వరుడు చేయి గడగడ వణికింది.
 
ఇది గమనించిన వధువు అతడి చేయి పట్టుకుని తన నుదుటిన సింధూరాన్ని పెట్టనివ్వలేదు. అతడు ఓ తాగుబోతు, పిచ్చివాడనీ అతడిని భర్తగా అంగీకరించనని పెళ్లి రద్దు చేయాలంటూ తన తల్లిదండ్రులకు చెప్పింది. దీనితో వ్యవహారం కాస్తా పోలీసు స్టేషనుకు వెళ్లింది. అక్కడ కూడా వధువు ఎంతమాత్రం అంగీకరించలేదు. ఎట్టిపరిస్థితుల్లో అతడిని తన భర్తగా అంగీకరించేది లేదని బలంగా చెప్పేసింది.

సిందూర్‌ సమయంలో వణికిన వరుడి చేయి.. పెళ్లి రద్దు చేసిన వధువు

బీహార్‌లోని కైమూర్ జిల్లాలో పెళ్లి తంతులో సిందూరం పెట్టే సమయంలో వరుడి చేయి వణికింది. దీంతో వధువు అతడిని పిచ్చివాడని ఆరోపించి పెళ్లి రద్దు చేసింది. ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్‌కు చేరాయి, కానీ వధువు నిర్ణయం మారలేదు. pic.twitter.com/FCgbOpvlLA

— ChotaNews App (@ChotaNewsApp) June 14, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు