డర్టీ పిక్చర్ సినిమాలో సిల్క్ స్మిత పాత్రను పోషించి యావత్ భారతదేశంలోని సినీ ప్రేక్షకులను తన అందాలతో కట్టిపడేసిన బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ నటించిన కహానీ చిత్రం డిసెంబరు 2న విడుదలైంది. ఐతే అంతకంటే వేగంగా ఈ చిత్రం మొత్తం అంతర్జాలంలో దర్శనిస్తోంది. పలు వెబ్ సైట్లు ఈ చిత్రాన్ని అప్ లోడ్ చేశాయి. ఈ లింకులను డౌన్లోడ్ చేసుకుని చాలామంది చిత్రాన్ని చూశారట.
ఐతే ఈ చిత్రం క్వాలిటీ పేలవంగా ఉందనీ, థియేటర్లోనే చూడాలని కొందరు అనుకుంటున్నారుట. మరికొందరు మాత్రం ఈ కహానీ తమకు చాలనీ, దానితోనే పండగ చేసుకుంటున్నారట. పైరసీని ఎంత అదుపు చేయాలని చూసినా, అలా చిత్రం విడుదల కాగానే ఇలా సినిమా నెట్లో దర్శనమిస్తోంది. దీనిపై నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.