ఇప్పటికీ దాని గురించి మాట్లాడేందుకు సిగ్గుపడుతున్నాం: విద్యాబాలన్

బుధవారం, 15 నవంబరు 2017 (10:12 IST)
బాలీవుడ్ నటి, డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్యాబాలన్ వివాహంపై కామెంట్లు చేసింది. వివాహం అనేది పునరుత్పత్తి కోసమేనని విద్యాబాలన్ అన్నారు. పునరుత్పత్తి కోసమే వివాహమని.. అదే భారతీయ సంస్కృతి అని విద్యాబాలన్ వెల్లడించింది. కానీ సాన్నిహిత్యంలోని ఆనందాన్ని చాలామంది కోల్పోతున్నారని.. సాన్నిహిత్యంలోనే ఆనందం వుందని వివరించింది.
 
అంతేగాకుండా ఇంత పెద్ద భారతదేశంలో ఇప్పటికీ సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడేందుకు సిగ్గుపడుతున్నామని విద్యాబాలన్ ఆవేదన వ్యక్తం చేసింది. కృపయా ధ్యాన్ దే సిరీస్ కోసం ''టాబూ" పేరుతో ఓ వీడియోను చిత్రీకరించిన సందర్భంగా విద్యాబాలన్ ఈ వ్యాఖ్యలు చేసింది. సెక్స్ అనేది కేవలం ఓ భావన మాత్రమేనని.. అది చర్యకాదనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నట్లు విద్యాబాలన్ వెల్లడించింది. 
 
ఇదిలా ఉంటే... విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ''తుమారీ సులు''. ఈ చిత్రానికి సురేశ్‌ త్రివేణి దర్శకత్వం వహించారు. ఇందులో విద్య ''సులోచన'' అనే లేట్‌ నైట్‌ రేడియో జాకీ పాత్రలో కనిపించనున్నారు. డిసెంబరు 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో.. బరువు ఎప్పుడు తగ్గుతారు? గ్లామర్ రోల్స్ ఎప్పుడు చేస్తారు? అనే ప్రశ్నకు విద్యాబాలన్ ఘాటుగా సమాధానం ఇచ్చింది.
 
"మీరు ఇలాంటి ప్రశ్నలు అడగడానికి బదులు మహిళల విషయంలో మీ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే చాలా బాగుంటుంది. నా పాత్రలతో నేను చాలా సంతోషంగా ఉన్నా. కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు, బరువు తగ్గడానికి మధ్య సంబంధం ఏంటి?" అని ఎదురు ప్రశ్న వేసింది. దీంతో ప్రశ్న అడిగిన రిపోర్టర్ షాక్ అయ్యాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు