Vijay Devarakonda, Family Star
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్" సినిమా రిలీజ్ డేట్ ను ఇవాళ మూవీ టీమ్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నట్లు అఫీషియల్ గా వెల్లడించారు. "ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హోల్ సమ్ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. "ఫ్యామిలీ స్టార్" చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.