గీత గోవిందం హిట్ కొట్టిన తర్వాత నోటా సినిమాతో మళ్లీ ఫ్లాపుల బాటపట్టాడు. నోటా ఫట్ కావడంతో నెటిజన్లు విజయ్ దేవరకొండపై విమర్శలు, సెటైర్లు రాశారు. ఇందుకు సమాధానంగా తనను చూసి నవ్వుకుంటున్న వాళ్లకు త్వరలోనే సమాధానం చెప్తానని విజయ్ తెలిపాడు.
ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్ సంస్థలో ప్రొడక్షన్ నెం.46 గా విజయ్ దేవరకొండ సినిమాను నిర్మించనుంది. "ఓనమాలు", "మళ్లీమళ్లీ ఇది రానిరోజు" లాంటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు క్రాంతిమాధవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
విజయ్ దేవరకొండతో ఈయనకు ఇదే తొలి కాంబినేషన్. అక్టోబర్ 18న హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్లె డి హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తుండగా.. జేకే సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.