'లైగర్' పెట్టుబడులపై నాకు తెలిసిన సమాచారం చెప్పా : విజయ్ దేవరకొండ

గురువారం, 1 డిశెంబరు 2022 (12:11 IST)
తాను నటించిన పాన్ ఇండియా మూవీ లైగర్ సినిమా పెట్టుబడుల గురించి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు తనకు తెలిసిన విషయాలను వెల్లడించారు. ఈయన వద్ద ఈడీ అధికారులు సుమారు 12 గంటల పాటు విచారణ జరిపారు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ రాత్రి 9 గంటలకు వరకు సాగింది. ఉదయం నుంచి ఏకధాటిగా విజయ్ దేవరకొండ వద్ద ఈడీ అధికారులు విచారణ జరిపారు. 
 
ఈ విచారణ తర్వాత ఆయన అధికారులతో మాట్లాడుతూ, పాపులారిటీ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం మామూలేనని వ్యాఖ్యానించారు. విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారని అందువల్లే తాను ఈడీ కార్యాలయానికి వచ్చినట్టు తెలిపారు. బాధ్యతగల పౌరుడిగా అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చినట్టు తెలిపారు. తనను మళ్లీ రమ్మని పిలవలేదన్నారు. 
 
కాగా, 'లైగర్' చిత్రాన్ని రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా, ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఈ పెట్టుబడులలో మనీలాండరింగ్, హవాలా కోణాలపై ఈడీ దర్యాప్తుపై చేపట్టింది. ఈ చిత్ర నిర్మాతలు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీలను కూడా ఈడీ ఇప్పటికే విచారించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు