విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ "సంతాన ప్రాప్తిరస్తు" టీజర్ ఇప్పటికే హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుండగా... తాజాగా ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ గ్రాండ్ గా బిగిన్ అయ్యాయి. ఈ రోజు ఈ సినిమా నుంచి 'నాలో ఏదో..' లిరికల్ సాంగ్ ను రేడియో మిర్చిలో లాంఛ్ చేశారు. 'నాలో ఏదో..' పాటకు మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ బ్యూటిఫుల్ ట్యూన్ ఇవ్వగా.. శ్రీజో క్యాచీ లిరిక్స్ అందించారు.
సింగర్స్ దినకర్ కల్వల, అదితి భావరాజు ఆకట్టుకునేలా పాడారు. 'నాలో ఏదో..' పాట ఎలా ఉందో చూస్తే - ' నాలో ఏదో మొదలైందని, నీతో చెలిమే రుజువైందని, కనులే చెబితే మనసే వినదా, నిజమే అనదా...' అంటూ సాగుతుందీ పాట. హీరో హీరోయిన్స్ విక్రాంత్, చాందినీ చౌదరిపై లవ్ సాంగ్ గా ఈ పాటను చిత్రీకరించారు.
రేడియో మిర్చిలో జరిగిన 'నాలో ఏదో..' సాంగ్ లాంఛ్ కార్యక్రమంలో హీరో విక్రాంత్, ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ సంజీవ్ రెడ్డి, లిరిసిస్ట్ శ్రీజో, సింగర్ అదితి భావరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లిరిసిస్ట్ శ్రీజో మాట్లాడుతూ - 'నాలో ఏదో..' సాంగ్ హీరో హీరోయిన్స్ లవ్ జర్నీని, వాళ్ల ఎమోషన్స్ ను చూపిస్తుంది. ఈ సినిమా చేసేప్పుడే మా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ లిరిక్స్ గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. పాటలోని సాహిత్యం అందంగా, క్లుప్తంగా ఉండాలని చెప్పారు. 'నాలో ఏదో..' సాంగ్ కు సునీల్ కశ్యప్ మంచి ట్యూన్ ఇచ్చారు. ఈ పాట మీ అందరిని ఆదరణ పొంది ఛాట్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నా. అన్నారు
సింగర్ అదితి భావరాజు మాట్లాడుతూ -'నాలో ఏదో..' సాంగ్ పాడటం హ్యాపీగా అనిపించింది. మ్యూజిక్ లవర్స్ రకరకాల పాటలు వింటుంటారు. అలా ఏ తరహా పాటలు వినేవారికైనా 'నాలో ఏదో..' సాంగ్ నచ్చుతుంది. ఈ పాట తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం. అన్నారు.
హీరో విక్రాంత్ మాట్లాడుతూ - సంతాన ప్రాప్తిరస్తు సినిమాకు పనిచేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాం. మా ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు, హరి ప్రసాద్ గారు, డైరెక్టర్ సంజీవ్ తో పాటు మా టీమ్ అంతా ఒక ఫ్యామిలీలా మూవీకి వర్క్ చేశాం. 'నాలో ఏదో..' సాంగ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ పాటకు సునీల్ కశ్యప్ ఛాట్ బస్టర్ ట్యూన్ ఇచ్చారు. మీరంతా ఈ పాటను ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - సంతాన ప్రాప్తిరస్తు ఒక కాంటెంపరీ ఫిల్మ్. 'నాలో ఏదో..' సాంగ్ గురించి చెప్పాలంటే చాలా విశేషాలు ఉన్నాయి. మా సంస్థకు సునీల్ కశ్యప్ ఎన్నో గుర్తుండిపోయే పాటలు ఇచ్చారు. ఇట్స్ మై లవ్ స్టోరీ మూవీలో నిన్నలా లేదే మొన్నలా లేదే సాంగ్, అలాగే ఏబీసీడీ మూవీలో అదితీ మెల్లమెల్ల మెల్లగా సాంగ్, శ్రీజో రాసిన నీవే ..పాట రాశారు. ఇలా వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన పాటే 'నాలో ఏదో..'. ఈ పాట టాప్ టెన్ ఛాట్ బస్టర్స్ లో ఉంటుందని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాం. మీ అందరికీ ఈ పాట తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.