కన్నడ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం విక్రాంత్ రోణ. పోస్టర్స్, గ్లింప్స్‌తో అంచనాలను పెంచుతూ వచ్చిన ఈ త్రీ డీ సినిమాను ఫిబ్రవరి 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ OTT సంస్థ విక్రాంత్ రోణకు ఫ్యాన్సీ డీల్ ఆఫర్ చేసింది. ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల్లో చాలా వరకు సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ విక్రాంత్ రోణ సినిమాను డైరెక్ట్ రిలీజ్ చేయడానికి ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసిందట. ఏకంగా రూ.100 కోట్లు ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినప్పటికీ విక్రాంత్ రోణ మేకర్స్ సింపుల్‌గా నో చెప్పేశారు.