ఆ ఇద్దరితో సినిమా చేయాలని వుంది: వినాయక్

బుధవారం, 21 అక్టోబరు 2020 (22:28 IST)
డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్... అఖిల్‌తో చేసిన మూవీ సక్సెస్ సాధించకపోవడంతో కెరీర్లో కాస్త స్లో అయినట్టు అనిపించారు. అయితే... ఇటీవల మెగా ఫోన్ పక్కన పెట్టి శీనయ్య అనే సినిమాలో మెయిన్ లీడ్లో నటిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. బ్లాక్‌బస్టర్ మూవీస్ తీయాల్సిన వినాయక్ ఇలా యాక్టర్ అవ్వడం ఏంటి అనుకున్నారు కొంతమంది సినీ ప్రముఖులు.
 
ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకపోవడంతో మళ్లీ డైరెక్షన్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. చిరంజీవితో లూసీఫర్ రీమేక్ చేయనున్నారు.
 
ఇదిలా ఉంటే... ఇటీవల వినాయక్ తన మనసులో మాటలను బయటపెట్టారు. స్టార్ హీరోల్లో దాదాపు అందరు అగ్ర హీరోలతో సినిమాలు చేసాను కానీ.. ఆ ఇద్దరితో సినిమాలు చేయలేదు. వాళ్లిద్దరితో సినిమా చేయాలనేది నా కోరిక అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు.
 
ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే... ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇంకొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. వాళ్లతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటున్నానని, కానీ ఆ టైమ్ వచ్చినప్పుడు సినిమా సెట్ అవుతుందని వినాయక్ నమ్మకంగా ఉన్నారు. 
 
అలాగే అఖిల్ సినిమా తర్వాత తనలో టాలెంట్ తగ్గిందంటూ వస్తున్న విమర్శల్ని కొట్టిపారేస్తున్నారు. ప్రతి మనిషికి గుడ్ టైమ్ బ్యాడ్ టైమ్ ఉంటుంది. బ్యాడ్ టైమ్ వచ్చినప్పుడు దానిని దాటుకుని వెళ్లడమే అంటూ తనకి మంచి టైమ్ వస్తుందని చెప్పకనే చెప్పారు. మరి.. పవన్, మహేష్‌ బాబులతో సినిమా చేయాలనే ఆయన కోరిక నెరవేరుతుందని ఆశిద్దాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు