నా భర్త ఇంట్లో లేనప్పుడు తలుపుకొట్టి రాబోయాడు, విశాల్‌కి ఇలా అవ్వడం హ్యాపీ: సుచిత్ర

ఐవీఆర్

గురువారం, 9 జనవరి 2025 (16:44 IST)
suchi leakesతో ఆమధ్య కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాగా చర్చనీయాంశమైన నటి సుచిత్ర. ఇపుడు మళ్లీ ఈమె మరోసారి వార్తల్లోకి వచ్చారు. నటుడు విశాల్ అలా గడగడ వణుకుతూ నడవలేని స్థితిలో వుండటాన్ని చూసి తను ఆనందపడుతున్నట్లు పరోక్షంగా కామెంట్లు చేసింది. విశాల్ తనను చాలా ఇబ్బంది పెట్టాడనీ, ఒకరోజు నా భర్త కార్తీక్ ఇంట్లో లేని సమయంలో ఎవరో తలుపు కొట్టే శబ్దం వినబడింది.
 
వెంటనే తలుపు తీస్తే ఎదురుగా విశాల్ చేతిలో వైన్ బాటిల్ పట్టుకుని నిలబడి వున్నాడు. కార్తీక్ వున్నాడా అని నన్ను అడిగాడు, లేడని చెప్పగానే అందుకే నేను వచ్చానంటూ అన్నాడు. నన్ను లోపలికి రానివ్వు అంటూ వచ్చే ప్రయత్నం చేసాడు. నేను అతడిని అడ్డుకుని గౌతమ్ ఆఫీసుకు వెళ్లమని చెప్పి తలుపు మూసేసాను. అలా నన్ను విశాల్ టార్చర్ పెట్టాడు అంటూ చెప్పుకొచ్చింది.
 
కాగా విశాల్ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నట్లు నటి ఖుష్బూ తెలియజేసింది. విశాల్ నటించిన మదగజరాజ చిత్రం ఈ సంక్రాంతికి విడుదల కాబోతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు