చిన్నారుల ప్రాణాలు తీసుకున్న దగ్గు మందు

ఠాగూర్

ఆదివారం, 5 అక్టోబరు 2025 (09:35 IST)
కొన్ని రకాలైన దగ్గు మందులు (కాఫ్ సిరప్) పలువురు చిన్నాలు ప్రాణాలు తీస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారాలో దగ్గు మందు తీసుకొన్న 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ దగ్గు సిరప్‌‌ను సూచించిన డాక్టర్‌ ప్రవీణ్‌ సోనిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామున డాక్టర్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
బాధిత చిన్నారుల్లో చాలా మందికి ఈయనే దగ్గు మందును సూచించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు సిరప్‌ను తయారు చేస్తున్న తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రీసన్‌ ఫార్మా యూనిట్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 
 
ఈ కంపెనీ తయారు చేసిన దగ్గు మందును తనిఖీ చేయగా అందులో 48.6 శాతం డై-ఇథైలిన్‌ గ్లైకాల్‌ ఉందని తేలింది. ఇది అత్యంత విషపూరితమైనదిగా అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ కంపెనీపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు