రైతుగా న‌టించ‌బోతున్న డైన‌మిక్ డైరెక్ట‌ర్. ఇంత‌కీ ఎవ‌రా డైరెక్ట‌ర్..?

గురువారం, 19 సెప్టెంబరు 2019 (10:49 IST)
డైన‌మిక్ డైరెక్ట‌ర్ రైతుగా న‌టించ‌బోతున్నాడ‌ట‌. ఇంత‌కీ ఎవ‌రా డైరెక్ట‌ర్ అనుకుంటున్నారా..? వి.వి.వినాయ‌క్. అవును.. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతోన్న సినిమాలో వినాయ‌క్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే... ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాలో వినాయ‌క్ పాత్ర ఎలా ఉంటుంది..? ఏ త‌ర‌హా సినిమా అనేది బ‌య‌ట‌కు రాలేదు కానీ... తాజాగా వినాయ‌క్ రైతుగా న‌టించ‌నున్నాడు అనే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.
 
కాగా అక్టోబర్‌‌లో వినాయక్ పుట్టినరోజున నాడు ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో వినాయక్ రైతుగా నటించనున్నారు. పైగా స్వాతంత్య్ర పూర్వం 1940ల కాలంలో ఈ సినిమా కథ సాగుతుందని తెలిసింది. ఇక ఇప్పటికే వినాయక్ ఈ సినిమా కోసం ఫిట్‌గా కనిపించడానికి జిమ్‌‌లో వర్కౌట్స్ చేస్తున్నారు. 
 
ఇటీవలే వినాయక్ జిమ్‌‌లో కష్టపడుతున్న ఓ పిక్ సోషల్ మీడియాలో సైతం బాగా వైరల్ అయింది. కాగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో వినాయక్ చాల సన్నగా కనబడాలట. ఆ సన్నివేశాలనే రెండో షెడ్యూల్‌లో ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ గ్యాప్‌లో వినాయక్ బాడీని ఇంకా తగ్గించటానికి తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారట.
 
వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందే ఈ సినిమాకి నరసింహారావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈయన గతంలో శరభ అనే సినిమాని తెర‌కెక్కించారు. మ‌రి.. ఇప్ప‌టి వ‌ర‌కు ద‌ర్శ‌కుడిగా విజ‌యం సాధించిన వినాయ‌క్ న‌టుడుగా ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు