బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి లో దోపిడీ చేస్తే 67 వేలు దొరికాగా ఏంజరిగింది?

దేవీ

సోమవారం, 14 జులై 2025 (10:04 IST)
Dixit Shetty, Vrinda Acharya and others
దీక్షిత్ శెట్టి హీరోగా అభిషేక్ ఎమ్ దర్శకత్వంలో రూపొండుతున్న తెలుగు- కన్నడ బైలింగ్వల్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’. బృందా ఆచార్య హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీ దేవి ఎంట‌ర్‌టైన‌ర్స్ బ్యానర్ పై హెచ్ కె ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్,  ఫస్ట్ సింగిల్ హర ఓం సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
ఈ రోజు మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేశారు. బ్యాంక్ దోపిడీకి వెళ్ళిన హీరో గ్యాంగ్ కి అక్కడ కేవలం 67 వేల రూపాయిలు మాత్రమే దొరుకుతాయి. తర్వాత ఎలాంటి పరిస్థితిలు ఎదురుకున్నారనేది చాలా ఎంటర్ టైనింగ్ గా టీజర్ లో ప్రజెంట్ చేశారు.
 
దీక్షిత్ శెట్టి పెర్ఫార్మెన్స్ ఎనర్జిటిక్ గా వుంది. తన కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ధీక్షిత్ శెట్టి, బృందా ఆచార్య మధ్య కెమిస్ట్రీ కూడా చాలా స్పెషల్ గా వుంది.
 
దర్శకుడు కామెడీ థ్రిల్లర్ యాక్షన్ అన్నీ అద్భుతంగా బ్లెండ్ చేశాడు. జుధాన్ శ్యాండీ బీజీఎం ఫన్ ని మరింత ఎలివేట్ చేసింది. మొత్తానికి టీజర్ సినిమాపై చాలా క్యిరియాసిటీని పెంచింది.  
 
ఈ చిత్రానికి అభిషేక్ జే డీవోపీగా పని చేస్తున్నారు. తేజస్ ఆర్ ఎడిటర్. రఘు మైసూర్ ప్రొడక్షన్ డిజైనర్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు