అంతకుముందు ఓ హిందీ సినిమా సమయంలో ఇంతకంటే దారుణమైన అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చింది. ‘ఓ హిందీ సినిమాలో నటించడానికి అవకాశం కల్పిస్తానని చెప్పిన ఓ నిర్మాత.. నన్ను వేరొకరి బెడ్రూమ్లో గడపమన్నాడు. అలా అయితేనే అవకాశం వస్తుందని చెప్పాడు. ఇది చాలా అనాగరికం అని, నన్ను బెడ్రూమ్కు రమ్మన్నవాడు నరకానికి పోతాడని గట్టి వార్నింగ్ ఇచ్చాన’ని చెప్పినట్టు రాధిక తెలిపింది.