తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

ఠాగూర్

బుధవారం, 16 ఏప్రియల్ 2025 (16:44 IST)
గత కొన్ని రోజులుగా క్యాస్టింగ్ కౌచ్ అంశం మల్లూవుడ్ షేక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మలయాళ నటి విన్సీ అలోషియస్ ఓ హీరోపై సంచలన ఆరోపణలు చేశారు. ఒక సినిమా షూటింగ్ సందర్భంగా హీరో తనతో ఎంతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించారు. ఆ హీరో షూటింగ్ సమయంలో డ్రగ్స్ తీసుకునేవాడని, తనతో అనుచితంగా ప్రవర్తించేవాడని చెప్పారు. 
 
ముఖ్యంగా ఆయన ముందే దుస్తులు మార్చుకోవాలంటూ ఒత్తిడి చేసేవాడని, అందరి ముందే ఇలా చేప్పేవాడని విన్సీ తెలిపారు. తన జీవితంలో ఇది ఒక అసహ్యకరమైన ఘటనగా ఆమె అభివర్ణించారు. షూటింగ్ జరిగినన్ని రోజులు అలానే ఇబ్బంది పెట్టారని వాపోయింది. ట్రగ్స్ అలవాటు ఉన్న నటులతో కలిసి నటించకూడదని ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 
 
తాను తీసుకున్న నిర్ణయం కారణంగా తనకు సినిమాల్లో ఎక్కువ అవకాశాలు రాకపోవచ్చని, అయినా తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి బహిరంగంగా చెబుతున్నానని అన్నారు. తనతో అలా ప్రవర్తించిన హీరో ఎవరో అందరికీ తెలుసని, కానీ, ఆయన పేరును ఎవరూ బహిర్గతం చేయరని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు