ఫిదా సినిమాను మొదట మహేస్‌బాబు, రామ్ చరణ్ తో చేయాలనుకున్నారు. ఇద్దరూ అందుకు ముందుకు రాలేదు. ఆ సమయంలో మెగాఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ సెట్ అయ్యాడు. ఎందుకని మహేష్‌తో చేయలేకపోయారనేందుకు ఆయన వివరిస్తూ, కథలో కొన్ని మార్పులు చేర్పులు సెట్‌కాలేదంటూ సున్నితంగా చెప్పాడు. నేను ఒకసారి కథ రాసుకున్నాక దానిని ఏవిధంగా మార్చనని శేఖర్ కమ్మల తేల్చి చెప్పారు. ఫిదా సినిమా లేడీ ఓరియెంటెడ్ మూవీ. అన్నీ సెట్ అయితే మహేష్‌కు మరింత గొప్ప సినిమా అయ్యేదని వెల్లడించారు. అయితే రామ్‌చరణ్ ఎందుకు వద్దన్నాడనే విషయం గురించి మాత్రం ఆయన వివరించలేదు. కారణం యాంకర్ ఆ ప్రశ్నకు అడగలేదు కాబట్టి.
ఎందుకు రిజక్ట్ చేశారనే దానికి శేఖర్ కమ్ముల క్లారిటీ ఇస్తూ, నేను కథ రాస్తాను. పాత్రలు ఇలా వుండాలని ఊహించుకున్నా. కానీ నెరేషన్ లో కొంచెం వీక్. నేను కథ చెబితే హీరోలకు ఆవులింతలు వస్తాయి. కాబట్టి నన్ను నమ్మి ఒప్పుకోవాలి. మిగతా పార్ట్ అంతా నేను చూసుకుంటాను అని తేల్చిచెబుతున్నాడు శేఖర్ కమ్ముల. తాజాగా ఆయన నాగచైతన్యతో చేసిన లవ్‌స్టోరీ కూడా అద్భుతమైన సినిమా అంటున్నాడు. కాకపోతే అది కరోనా వల్ల వాయిదా పడింది.