కలెక్షన్ కింగ్ మోహన్ బాబు... ఇటీవల కాలంలో సినిమాల్లో నటించడం బాగా తగ్గించేసారు. కథ బాగుంది... తన పాత్ర బాగుంది అని నమ్మితేనే తప్ప అసలు సినిమాల్లో నటించేందుకు ఒప్పుకోవడం లేదు. ఇటీవల మహానటి సినిమాలో నటించారు. అది ఎస్వీఆర్ పాత్ర కాబట్టి. ఇలాంటిది మోహన్ బాబు సూర్య సినిమాలో నటిస్తున్నాడు అని ఎనౌన్స్‌మెంట్ వచ్చేసరికి ఇది నిజమా..? కాదా..? అని కాస్త డౌట్ పడ్డారు.
తీరా ఆరా తీస్తే... నిజమే అని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. బాక్సింగ్ నేపథ్యంలో హిందీలో ‘సాలా కదూస్’, తమిళంలో ‘ఇరుది సుట్రు’ పేరుతో సుధ కొంగర దర్శకత్వం వహించిన చిత్రం ఆమెకు మంచి పేరు తెచ్చిన విషయం తెలిసిందే. ఇరుది సుట్రు చిత్రాన్ని తెలుగులో ‘గురు’ పేరుతో సుధ కొంగర తెరకెక్కించారు. ఇప్పుడు సూర్య హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ‘సూరరై పోట్రు’. ఈ చిత్రాన్ని సూర్య నిర్మిస్తుండడం విశేషం.
అయితే.. ఇందులో కథను మలుపు తిప్పే అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్రకు మోహన్‌బాబు అయితే కరెక్ట్‌గా సరిపోతారని భావించి ఆయన్ను అప్రోచ్ అయ్యారట చిత్ర యూనిట్. ఈ చిత్ర కథ, ఇందులో ఆయన పాత్ర నచ్చి నటించేందుకు మోహన్ బాబు అంగీకరించారట. దీని వెనకున్న అసలు కారణం ఏంటంటే... మంచు లక్ష్మి ఇటీవల సూర్య భార్య జ్యోతికతో కలిసి ఓ సినిమా చేసారు. అప్పుడు వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆవిధంగా సూర్య సినిమాలో నటించేందుకు మంచు లక్ష్మీని కాంటాక్ట్ చేసారట.