ఇదిలా వుండగా, తెలంగాణలో ఇప్పట్లో థియేటర్ల ఓపెన్ చేయాలంటే ప్రస్తుతం నెలకొన్న రాత్రి కర్యూ తొలగించాకే సాధ్యమని ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ నారంగ్ స్పష్టం చేశారు. ఆయన నిర్మించిన శేఖర్ కమ్ముల సినిమా లవ్‌స్టోరీ అప్పుడే థియేటర్లో విడుదల చేస్తామన్నారు. ఇదే అభిప్రాయాన్ని ఇటీవల జరిగిన ఎగ్జిబిటర్ల మీటింగ్‌లో అందరూ మాట్లాడారు. అయితే ఇక్కడో సమస్యకూడా వారు వెలిబుచ్చారు. చిరకాలంగా తమ సమస్యలు అలానే వున్నాయని వాటిని పరిష్కరించాలని పట్టుబడుతున్నారు. ఈ మేరకు హీరోలు చిరు, నాగ్ లతో పాటు మంత్రి తలసానిని కలిసి, వారి ద్వారా సిఎమ్ కు సమస్యలను నివేదించాలని, థియేటర్లు తెరచుకునేలోగానే వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. అందులో టికెట్ రేట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ టాక్సీ, పార్కింగ్ ఫీజు, కేంటిన్ వంటి సమస్యలు వున్నాయి. వాటి గురించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.