అయితే, కొంత పార్ట్ ఇంకా షూట్ చేయాల్సి ఉండగా, ఈలోపు విక్రమ్ మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న పొన్నీయిన్ సెల్వన్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. అందులో ఆయనపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. నెలరోజుల పాటు విక్రమ్కి సంబందించిన ఈ చిత్ర షెడ్యూల్ జరగనుంది. కాగా ఇప్పుడు తాజా విషయం ఏమిటంటే, కోబ్రా దర్శకుడు అజయ్ జ్ఞానముతు మార్చి లేదా ఏప్రిల్ నాటికి రష్యాలో షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు, సుమారు 30 నుండి 35 రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉందని, షూటింగ్‌ను ఒకేసారి అంటే సింగల్ షెడ్యూల్లో ముగించాలని చూస్తుండగా, విక్రమ్కి మణిరత్నం సినిమా వలన డేట్స్ అడ్జెస్ట్ అవ్వడం లేదని తెలుస్తుంది. త్వరితగతిన పొన్నిన్ షూట్ ఫినిష్ చేసి కోబ్రాలో జాయిన్ అవ్వాలని విక్రమ్ రెస్ట్ లేకుండా షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.