సామాజికంగా ఉపయోగపడే, సందేశం ఇచ్చే వీడియోలతో యూట్యూబ్‌లో బాగా పాపులర్ అయిన యూట్యూబర్ చందు సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో యువతిపై అత్యాచారం, మోసం చేశాడనే ఆరోపణలపై అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చందు సాయిని అరెస్ట్ చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.