సుధీర్ బాబు హీరోగా సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్ కె.ఆర్.బన్సాల్, ప్రేరణ అరోరా నిర్మాతలుగా తెరకెక్కుతోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో శనివారం నాడు జరిగాయి. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరీష్ శంకర్, మైత్రీ నిర్మాత రవిశంకర్, దర్శకుడు వెంకీ అట్లూరి, దర్శకుడు మోహన ఇంద్రగంటి, శిల్పా శిరోధ్కర్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు.